శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (12:35 IST)

ట్రంప్ అరుపులకు ఎలా స్పందించాలో తెలుసు.. ఆయనో మానసిక రోగి: కిమ్ జాంగ్

ప్రపంచ దేశాలను అణు పరీక్షలతో గడగడలాడిస్తోన్న ఉత్తర కొరియా.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. జపాన్, దక్షిణ కొరియా ప్రజలకు అణు పరీక్షలతో చుక్కలు చూపిస్తున్న ఉత

ప్రపంచ దేశాలను అణు పరీక్షలతో గడగడలాడిస్తోన్న ఉత్తర కొరియా.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. జపాన్, దక్షిణ కొరియా ప్రజలకు అణు పరీక్షలతో చుక్కలు చూపిస్తున్న ఉత్తర కొరియా అమెరికా చీఫ్‌కు హెచ్చరించింది. ఇన్నాళ్లు.. ట్రంప్ పేరు చెప్పకుండానే విమర్శలు గుప్పింస్తూ.. తన అధికార మీడియా.. మంత్రులతో మాట్లాడించిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ తొలిసారిగా స్వయంగా హెచ్చరించారు. 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ మానసిక రోగి అంటూ కిమ్ జాంగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాను నాశనం చేస్తామని.. అందుకు దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చిన ట్రంప్ వ్యాఖ్యలను ఊటంకిస్తూ కిమ్ జాంగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాను నాశనం చేయాలనుకుంటే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. 
 
ఇంకా డొనాల్డ్ ట్రంప్ అరుపులపై ఎలా స్పందించాలో.. ఎప్పుడు స్పందించాలో తనకు బాగా తెలుసునని కిమ్ జాంగ్ వెల్లడించారు. అమెరికా సుప్రీం కమాండ్ ప్రతినిధిగా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయన అందుకు ప్రతిగా విలువైన వాటిని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కిమ్ జాంగ్ పసిఫిక్ మహా సముద్రం నుంచి మరో హైడ్రోజన్ బాంబును పరీక్షించనున్నట్లు సమాచారం.