ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

డోనాల్డ్ ట్రంప్‌ హెచ్చరికలు కుక్క అరుపులతో సమానం : ఉత్తర కొరియా

ఉత్తర కొరియాను ప్రపంచ చిత్రపటంలో లేకుండా సమూలంగా నాశనం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన భీకర హెచ్చరికను.. ఆ దేశం తేలికగా కొట్టిపారేసింది. ట్రంప్‌ హెచ్చరికలను కుక్క అరుపులతో పోల్చి

ఉత్తర కొరియాను ప్రపంచ చిత్రపటంలో లేకుండా సమూలంగా నాశనం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన భీకర హెచ్చరికను.. ఆ దేశం తేలికగా కొట్టిపారేసింది. ట్రంప్‌ హెచ్చరికలను కుక్క అరుపులతో పోల్చింది. ఈ బెదిరింపులకు ఉత్తరకొరియా లొంగే ప్రసక్తే లేదని ఉ.కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్‌ హో తేల్చి చెప్పారు. 
 
ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించిన డొనాల్డ్‌ ట్రంప్‌.. ఉత్తర కొరియాపై తీవ్రంగా విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అమెరికాపైగానీ, తన మిత్రదేశాలపైగానీ దాడిచేస్తే.. కొరియాను సమూలంగా నాశనం చేస్తానని హెచ్చరించారు. ఉ.కొరియా ఇటీవల వరుసగా అణ్వాయుధ పరీక్షలు, క్షిపణీ ప్రయోగాలు చేస్తుండటంతో ట్రంప్‌ ఈ మేరకు హెచ్చరికలు జారీచేశారు. 
 
ఐరాస సమావేశాల్లో పాల్గొనడానికి న్యూయార్క్‌ వచ్చిన ఉ.కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్‌ హోను ట్రంప్‌ హెచ్చరికలపై విలేకరులు ప్రశ్నించగా.. ఒక సామెతతో బదులిచ్చారు. 'ఏనుగుల ఊరేగింపు సాగుతుంటే.. కుక్కలు మొరుగుతాయి' అని యాంగ్‌ పేర్కొన్నారు. 'కుక్క అరుపులతో వారు మమ్మల్ని బెదిరించాలని చూస్తే.. అది శునకస్వప్నమే అవుతుంది' అని ఎద్దేవా చేశారు.