శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (15:02 IST)

సైబీరియన్ మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం: 37మంది మృతి.. 100మందికి పైగా గల్లంతు

రష్యాలోని సైబీరియన్ షాపింగ్ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 37మంది సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని కెమెరోవోలోని సైబీరియా షాపింగ్ మాల్‌లో వున్నట్టుండి మంటలు చెలరేగాయి

రష్యాలోని సైబీరియన్ షాపింగ్ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 37మంది సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని కెమెరోవోలోని సైబీరియా షాపింగ్ మాల్‌లో వున్నట్టుండి మంటలు చెలరేగాయి.

మాస్కోకు 3600 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ కెమెరోవో నగరం బొగ్గు ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచినది. అయితే ఉన్నట్టుండి షాపింగ్ మాల్ నిండా దట్టమైన నల్లని పొగలు కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. 
 
ఈ ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోగా 70మంది ఆచూకీ కానరాలేదని అధికారులు చెప్పుకొచ్చారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని, వందలాది మందిని ఆ ప్రాంతం నుంచి తరలించినట్లు అధికారులు చెప్పారు.

చుట్టు ముడుతున్న అగ్ని కీలల నుంచి బయటపడేందుకు చాలామంది షాపింగ్ మాల్  గోడలు, కిటీకీల నుంచి దూకడం కనిపించింది. ఇంకా సినిమాకు సంబంధించిన వీడియో తీస్తుండగా.. ఈ ప్రమాదం జరిగి వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.