సౌదీ దళాలు ప్రతీకార దాడులకు దిగాయా? యెమెన్‌పై దాడి.. 31మంది మృతి
సౌదీ దళాలు యెమెన్‌పై జరిపిన దాడిలో 31మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 31 మంది పౌరులు మృతి చెందారని, మరో 12 మంది గాయపడ్డారని ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. అయితే, సౌదీ మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
వివరాల్లోకి వెళితే.. యెమెన్ ఉత్తర ప్రావిన్సులోని అల్ జాఫ్ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని వార్తలు వస్తున్నాయి.
అలాగే సౌదీ నేతృత్వంలోని దళాలు జెట్ విమానాన్ని కూల్చేశాయి. అంతకుముందు రోజు సౌదీ జెట్ విమానం ఒకటి కూలిపోయింది. దీనిని తామే కూల్చేసినట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. దీంతో సౌదీ ఈ ప్రతీకార దాడులకు దిగినట్టు తెలుస్తోంది.