శనివారం, 7 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (12:36 IST)

పాకిస్థాన్‌లో టెర్రర్ అటాక్.. బస్సుపై కాల్పులు ఎనిమిది మంది మృతి

పాకిస్థాన్‌లో తీవ్రవాదుల దాడి జరిగింది.  ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. పాకిస్థాన్‌లోని గిల్గిట్ బాల్టిస్థాన్‌లో ఈ టెర్రర్ అటాక్ జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. మృతుల్లో పలువురు సైనికులతో పాటు సామాన్యులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
 
ఘిజర్ నుంచి రావల్పిండి వెళుతున్న ప్యాసింజర్ బస్సుపై చిలాస్ సిటీ దగ్గర్లో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. శనివారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారని వివరించారు.