1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మే 2024 (10:24 IST)

ఎలాన్ మస్క్ కాపురం కూలిపోవడానికి కారణం ఏంటి?

elon musk
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ కాపురం కూలిపోయింది. ఆయ భార్య జస్టిన్ మస్క్‌ల సంసారం విచ్ఛిన్నమైంది. దీనికి కారణం న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. 2021లో బర్త్ డే పార్టీలో గూగుల్ సహ వ్యవస్థాకుడి భార్య షానహాన్ భార్యతో ఎలాన్ మస్క్ ఎఫైర్ పెట్టుకున్నట్టు సమాచారం. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన తాజా సంచల కథనం ప్రకారం... వారి ఎఫైర్ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయని పేర్కొంది. గతంలో కూడా మస్క్ ఎఫైర్‌ వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో మస్క్, షానహాన్ దీన్ని ఖండించారు. 
 
న్యూయార్క్ కథనం మేరకు... బ్రిన్, మస్క్ సుధీర్ఘకాలంగా స్నేహితులు. గత 2021లో నికోల్ న్యూయార్క్‌లో బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి మస్క్ కూడా హాజరయ్యారు. అదే యేడాది మస్క్ సోదరుడు ఏర్పాటు చేసిన మరో పార్టీలో వీరు మళ్లీ ఒకరికొకరు తారసపడ్డారు. ఆ పార్టీలో కీటమైన్ అనే డ్రగ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ పార్టీ నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోయారు. కొన్ని గంటల తర్వాత మళ్లీ పార్టీలో ప్రత్యక్షమయ్యారు. ఈ సమయంలోనే వారు దగ్గరైనట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 
 
మస్క్‌తో తన ఎఫైర్ గురించి షానహాన్ భర్త బ్రిన్‌తో చెప్పిందని సమాచారం. తన స్నేహితులు, బంధువుల ముందు కూడా ఆమె ఈ విషయాన్ని అగీకరించింది. ఈ పార్టీ తరవాతే బ్రిన్, షానహాన్ విడిపోయారు. 2022లో వారు విడాకులకు దరఖాస్తు చేసుకోగా మరుసటి యేడాది విడాకులు మంజూరయ్యాయి.