గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 18 మే 2024 (20:07 IST)

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

Chandrakanth-Pavithra-silpa
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నటి పవిత్ర జయరామ్ స్నేహితుడు, నటుడు చంద్రకాంత్ నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా చంద్రకాంత్ భార్య శిల్ప నటి పవిత్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె మాటల్లోనే... పవిత్ర నా భర్తకు పరిచయం కాకముందు షూటింగుకి వెళ్లినా నిత్యం నాకు ఫోన్ చేసేవాడు. కన్నా... కన్నా వచ్చేస్తున్నారా అంటూ చెప్పేవాడు. చందు నేను ఆరేళ్లపాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. కానీ కరోనా లాక్ డౌన్ రావడంతోనే నా జీవితం మారిపోయింది. నిత్యం బెంగళూరు సంగతులు చెప్తుండేవాడు. పవిత్ర గురించి చెబుతుంటే స్నేహితులే కదా అని వదిలేసాను. కానీ ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడని గుర్తించలేకపోయాను.
 
ఆ తర్వాత క్రమంగా నన్ను చిన్నచిన్న విషయాలకే తిట్టడం మొదలుపెట్టాడు. నన్ను కన్నా.. కన్నా అంటూ ఎంతో ప్రేమగా నేనే లోకంగా వుండేవాడిలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందని బాగా గమనించాను. చివరికి చందుకి పవిత్రతో సంబంధం వుందని అర్థమైంది. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం తెలియగానే ప్రశ్నించాను. అలా అడిగిన తర్వాత నన్ను కొట్టడం, తాగి వచ్చి గొడవ చేయడం లాంటివి చేసేవాడు. ఎప్పుడూ పవిత్ర ఫోటోనే చూస్తూ ఉండిపోయేవాడు. చందు నన్నూ, నా పిల్లలకూ బాధ్యత తీసుకోలేదు. నా పిల్లల బాధ్యత తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాను. ఒకసారి పవిత్ర నేరుగా నాకు ఫోన్ చేసి చంద్రు నా భర్తే నువ్వేమీ చేయలేవు అని బెదిరించింది. ఈ విషయం పవిత్ర పిల్లలకు కూడా తెలుసు. నేను ఆమె కొడుకుతో చెప్పినప్పుడు, అతను వారిద్దరి విషయంలో నేను జోక్యం చేసుకోనని చెప్పాడు.
 
ఆ తర్వాత చందుకి ఒకటే చెప్పాను. నేను కావాలా.. పవిత్ర కావాలా అని ప్రశ్నించాను. దాంతో నన్ను విడిచిపెట్టి పవిత్రతో వుండిపోయాడు. ఇక నేనేమీ మాట్లాడలేదు. నాతో లేకపోయినా ఆమెతోనైనా సుఖంగా వుంటాడని అనుకుని సరిపెట్టుకున్నాను. నాతో మాట్లాడి సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ పవిత్ర రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆమె చనిపోయాక ఇక్కడికి వచ్చాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఏమీ ఆలోచన చేయవద్దు. పిల్లల కోసం బ్రతకాలి అని అన్నాను. నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడిని కాదని చెప్పిన 24 గంటల లోపే సూసైడ్ చేసుకున్నాడు అని బోరున విలిపించింది చంద్రకాంత్ భార్య శిల్ప.
 
చంద్రకాంత్ తల్లి కూడా సీరియల్ నటి పవిత్రనే తప్పుపట్టింది. ఇదంతా పవిత్ర వల్లే జరిగింది. ఆమె నా కొడుకును మా నుండి దూరం చేసింది. ఇంటికి వచ్చి భార్యను కొట్టేవాడు. నాకు పవిత్ర లోకం అంటుండేవాడు. ఆమెను విడిచిపెట్టమని ఎంత చెప్పినా వినలేదు అంటూ వెల్లడించింది.