ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 మే 2024 (10:04 IST)

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

chandrakanth
chandrakanth
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు సహనటుడు చంద్రకాంత్ ఆత్మహత్య పరిశ్రమలో విషాదం నింపింది. 
 
పవిత్రతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా శేరిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అదే కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు. 
 
పవిత్ర మరణం తర్వాత మానసికంగా కుంగుపాటుకు గురైన చంద్రకాంత్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మణికొండ మునిసిపాలిటీలోని అల్కాపూర్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు.
 
స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో ఫ్లాట్‌కు వచ్చి చూడగా ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. చంద్రకాంత్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ విభేదాల కారణంగా వారికి దూరంగా ఉంటున్నాడు. చంద్రకాంత్ తండ్రి చెన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.