సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (08:56 IST)

పిల్లిని మింగేసిన కొండచిలువ.. కడుపులో చిక్కుకుపోవడంతో..?

Cat
పెంపుడు పిల్లిని కొండచిలువ మింగేసింది. థాయిలాండ్‌కు చెందిన ఓ కుటుంబం గత కొంతకాలం నుంచి ఓ పెంపుడు పిల్లిని పెంచుకుంటున్నారు. అయితే ఆ పిల్లి ఇంట్లో నుంచి అదృశ్యమైంది. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు పిల్లి ఆచూకీ కోసం ఇల్లంతా గాలిస్తున్నారు. ఇంట్లోని ఓ బాలికకు తమ గది స్లాబ్ మీద భారీ కొండ చిలువ కనిపించింది. కొండచిలువను చూసిన ఆ బాలిక గట్టిగా కేకలు వేసింది.
 
ఈ క్రమంలో ఆమె తల్లి అక్కడికి వెళ్లి చూడగా, ఆ పిల్లిని కొండచిలువ మింగినట్లు గుర్తించింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు కొండచిలువను బంధించారు. అయితే దాని కడుపులో ఉన్న కొండచిలువను బయటకు తీయడం కష్టమని అధికారులు చెప్పడంతో.. ఆ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.