ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (19:06 IST)

ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న కరోనా.. సెకండ్ వేవ్.. ఫ్రాన్స్‌లో 30వేలకు పైగా..?

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌కు ప్రారంభ దశలో ఉందని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో కొవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. కొన్ని దేశాల్లో ఆ దశ కూడా దాటిపోయింది. ఫ్రాన్స్‌లో అయితే.. ఏకంగా కరోనా థర్ద్ వేవ్ మొదలైంది. ఫ్రాన్స్ ప్రధాని జీన్‌ క్యాస్టెక్స్‌ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 
 
ఫ్రాన్స్‌లో బుధవారం కొత్తగా 29,975 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా 320 మంది మరణించారు. చాలా రోజుల తర్వాత అక్కడ ఒక్క రోజు కేసులు 25,000కు పైగా పెరిగాయి. పారిస్ సహా ప్రధాన నగరాలు, పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో ఫ్రెంచ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
అయితే.. మరోసారి లాక్‌డౌన్‌ విధించే అవసరం ఉండకపోవచ్చునని ఫ్రాన్సె అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్‌ అభిప్రాయపడ్డారు. ఇక వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ పుంజుకుంటుంది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో ఫ్రాన్స్‌ ఏడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు అక్కడ 4.11 మిలియన్ల మంది కొవిడ్ బారినపడ్డారు.