Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

"జీ సూయిస్ రావి" అంటూ ప్రధాని ట్వీట్..

Written By సెల్వి
Updated: గురువారం, 5 మే 2022 (16:17 IST)
PM modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో వున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించినట్లు మోదీ తెలిపారు. "జీ సూయిస్ రావి" అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. జీ సూయిస్ రావి (చాలా సంతోషంగా ఉంది) అంటూ తమ భేటీ గురించి వివరించారు. 
 
ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రోన్‌తో రెండు దేశాల భాగస్వామ్యం అనేక రంగాలకు విస్తరించిందని, ఈ బంధం గర్వకారణమన్నారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని, ఇంతటి మంచి ఆతిథ్యం ఇచ్చిన ఫ్రాన్స్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేర‌కు ఫ్రెంచ్‌లోనూ ఆయన ట్వీట్ చేశారు.
 
కాగా, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరింధమ్ బాగ్చీ కూడా ఇరు దేశాధ్యక్షుల సమావేశం గురించి ట్విట్టర్‌లో వెల్లడించారు. 
 
భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై తదుపరి చర్యలకు మోదీ, మెక్రాన్ అంగీకరించారని చెప్పారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాధినేతలు ఉక్రెయిన్ సంక్షోభంపై చాలా సేపు చర్చించినట్టు తెలుస్తోంది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments