ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2024 (16:49 IST)

No Confidence Vote ప్రధాని మిచెల్‌‍పై అవిశ్వాస తీర్మానం... ఫ్రాన్స్ కీలక పరిణామం

Michel Barnier
French Prime Minister Michel Barnier ​loses no-confidence vote ఫ్రాన్స్ దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మితవాద, అతివాద చట్టసభ సభ్యులంతా ఒక్కటై ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీంతో మిచెల్ బార్నియర్ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఫ్రాన్స్ చరిత్రలో 1962 తర్వాత అవిశ్వాస తీర్మానంతో పదవి నుంచి వైదొలగనున్న తొలి ప్రధానిగా బార్నియర్ నిలవనున్నారు. ఆయన ప్రధానిగా కేవలం మూడు నెలలు మాత్రమే ఉన్నారు. అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగానూ మిచెల్ నిలిచారు.
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి. అసెంబ్లీలో 577 ఓట్లు ఉండగా.. ప్రధానికి వ్యతిరేకంగా 331 ఓట్లు వచ్చాయి. అవిశ్వాస తీర్మానాన్ని తొలుత మితవాద సభ్యులు ప్రవేశపెట్టగా, మారైన్ లెపెన్ నేతృత్వంలోని ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ మద్దతు ఇచ్చింది. దీంతో ప్రధానికి వ్యతిరేకంగా భారీగా ఓట్లు వచ్చాయి. ఈ ఘటనతో బార్నియర్ అధ్యక్షుడు మెక్రాన్‌ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు.
 
గత జులైలోనే అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నూతన ప్రధానిగా బార్నియర్‌ను నియమించగా, మూడు నెలలకే ఆయన పదవిచ్యుతుడయ్యారు. అంతకుముందు 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. గత జులైలో ఆయన ఆ పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఈ ఏడాదిలోనే మూడోసారి ప్రధానిని నియమించడం మెక్రాన్‌కు సవాల్‌గా మారనుంది. ఇక అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు.