దిశా కేసు మరచిపోకముందే.. 8 యేళ్ళ బాలికపై అత్యాచారం..
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. పశువైద్యురాలు దిశా ఘటన మరచిపోకముందే ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. రాజ్‌కోట్ నగరంలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకువచ్చి, ఆమెకు కత్తి చూపించి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజ్‌కోట్ నగరానికి చెందిన హర్దేవ్ అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. రాజ్‌కోట్ నగరంలోని ఓ పబ్లిక్ పార్కులో 8 ఏళ్ల బాలిక తన తల్లి పక్కన నిద్రిస్తోంది. హర్దేవ్ అనే వ్యక్తి రాత్రివేళ బాలికను కిడ్నాప్ చేసి పొదల్లోకి తీసుకువెళ్లి, ఆమెకు కత్తి చూపించి బెదిరించి అత్యాచారం చేశాడు. తీవ్ర గాయాలతో పొదల్లో బాలిక పడి ఉండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు వచ్చి బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన హర్దేవ్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రాజ్‌కోట్ నగరంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.