శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్ కుమార్
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:32 IST)

ల్యాబోరేటరీలో జరిగిన తప్పు.. చిన్నారుల ఒళ్లంతా జుట్టు..!

ల్యాబోరేటరీలో జరిగిన తప్పిదం వల్ల 17మంది చిన్నారుల ఒళ్లంతా జుట్టు మొలిచింది. బాధితులలో ఏడాది వయస్సు ఉన్న చిన్నారులు కూడా ఉండటం శోచనీయం. ముఖంతో సహా అన్ని భాగాల్లో వెంట్రుకలు మొలవడంతో ఆ చిన్నారులు నక్కల్లా కనిపిస్తున్నారు. ఈ సంఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. పొరపాటున జుట్టు రాలే సమస్యకు ఉపయోగించే మందును వాడటం వల్ల ఈ దారుణం జరిగింది. 
 
సాధారణంగా గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడే చిన్నారులకు ఒమెప్రజోల్ అనే మందును ఇస్తుంటారు. దీన్ని ప్రభుత్వమే అందిస్తుంది. అయితే, ఈ మందు తయారీ సమయంలో ల్యాబోరేటరీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒమెప్రజోల్ అని రాసివున్న కంటైనర్లో పొరపాటున మినోక్షిడిల్ అనే ఔషదాన్ని ఉంచారు. దీంతో ప్యాకింగ్ సిబ్బంది దాన్ని ఒమెప్రజోల్‌గా భావించి వాటిని ఫార్మసీలకు పంపారు. 
 
అదే పేరుతో వాటిని విక్రయించడంతో చిన్నారుల తల్లిదండ్రులు గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ సమస్యకు వాటిని ఔషదంగా ఇచ్చేవారు. ఈ మందు వాడిన చిన్నారుల శరీరంపై ఇటీవల జుట్టు విపరీతంగా పెరగడం మొదలైంది. ఈ సమస్యను వైద్య పరిభాషలో వేర్వోల్ఫ్ సిండ్రోమ్ అంటారు.