సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 21 జూన్ 2022 (20:45 IST)

గర్భంలోనే శిశువు తలను కోసేసి వదిలేసారు, మహిళ పరిస్థితి విషమం...

baby boy
పాకిస్తాన్ దేశంలోని సింధు ప్రావిన్సులో ఘోరమైన ఘటన జరిగింది. గర్భవతిగా వున్న 32 ఏళ్ల మహిళ ప్రసవ వేదనతో ఆసుపత్రికి వచ్చింది. ఆమెకి అనుభవం లేని వైద్యులు ఆపరేషన్ చేయడంతో శిశువును బయటకు తీసే క్రమంలో బిడ్డ తలను కోసేసి గర్భంలోనే వదిలేసారు. దీనితో మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.

 
ఈ ఘటన పాకిస్తాన్ లోని థారపార్కర్ జిల్లాలోని ఆరోగ్య కేంద్రంలో జరిగింది. ఆ కేంద్రంలో మహిళా గైనకాలజిస్టులు లేకపోవడంతో అనుభవం లేని సిబ్బంది ఆమెకి పురుడు పోసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో బిడ్డను ఆపరేషన్ చేసి తీసే క్రమంలో చేతకాక శిశువు తలను కోసేసారు.


బిడ్డ తలను మహిళ గర్భంలోనే వదిలేసారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే లియాకత్ వర్సిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు ఆమెకి శస్త్రచికిత్స చేసి గర్భంలో వున్న శిశువు తలను ఇతర భాగాలను వెలికి తీసారు. ఐతే మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.