మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 మే 2016 (16:42 IST)

ఊరుకో నా నాన్న.. నిన్ను ఊరడించ నేనున్నా.. బాబును ఊరడించిన ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ బాలుడిని ఊరడించారు. ఎత్తుకుని ఏడుపును ఆపేందుకు ప్రయత్నించారు. జపాన్‌లోని హిరోషిమాలో ఒబామా చారిత్రక పర్యటనలో భాగంగా శుక్రవారం హిరోషిమా పీస్ మెమోరియల్ పార్కును సందర్శించారు. ఆపై లవకుని యూస్ మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ సందర్శించారు. అక్కడ ప్రసంగం పూర్తి చేసుకున్న ఒబామా ప్రజల్లో కలిసిపోయారు. 
 
ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి కరచాలనాలు చేస్తున్నారు. ఆ జనంలో ఓ బుల్లి బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అంతే ఆ బాబును ఆప్యాయంగా చేతికి తీసుకున్న ఒబామా ఆ చిట్టి తండ్రిని ఊరడించారు. ఒక్క క్షణం వూరడించగానే బుడ్డోడు టక్కున ఏడుపును ఆపేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒబామా చేతి స్పర్శలో ఏం మాయ ఉందో అనుకుంటూ తెగ ముచ్చటపడిపోయారు.