గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (10:02 IST)

140 ఏళ్ల తర్వాత వరదల్లో మునిగిన హాంకాంగ్

Rain
Rain
కుండపోత వర్షం హాంకాంగ్‌ను ముంచెత్తింది. ఇది వరదలకు దారితీసింది. వీధులు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్‌లు నీట మునిగిపోయాయి. పాఠశాలలు మూతపడ్డాయి. 140 సంవత్సరాల తర్వాత భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి.
 
హాంకాంగ్ అబ్జర్వేటరీ రాత్రి 11 గంటల మధ్య 158.1 మిల్లీమీటర్లు (6.2 అంగుళాలు) వర్షపాతం నమోదైంది. వాతావరణ బ్యూరో అత్యధిక "బ్లాక్" అలెర్ట్ హెచ్చరికను జారీ చేసింది. 
 
గురువారం రాత్రి నుండి హాంకాంగ్ ఈశాన్య భాగంలో 200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని చెప్పారు. హాంకాంగ్ వర్షాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.