శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

విమానం టైరుకు మంటలు... 11 మందికి తప్పిన ప్రమాదం...

flight accident
హాంకాంగ్ విమానాశ్రయంలో పెను ప్రమాదం జరిగింది. లాస్ ఏంజెలిస్‌కు బయలుదేరిన క్యాథే ఫసిఫిక్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని వెంటనే గుర్తించిన పైలెట్.. హుటాహుటిన టేకాఫ్ చేశారు. అయితే అప్పటికే విమానం టైరుకు నిప్పు అంటుకుంది. ఆ వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి కిందకు పంపించేశారు. 
 
ఈ ప్రమాదంలో 11 గాయపడ్డారు. వీరికి తృటిలో ప్రాణాపాయం తప్పినప్పటికీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్లైడ్స్‌పై జారే ప్రయత్నంలో వీరంతా గాయపడ్డారు. వీరికి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత వారిని డిశ్చార్జ్ చేశారు. 
 
అయితే, విమానంలో లోపం ఏంటన్నది విమానయాన సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. అయితే, విమానంల టైరుమంటల్లో చిక్కుకోవడం తామంతా చూశామని కొందరు ప్రయాణికులు మీడియాకు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 17 మంది సిబ్బందితో పాటు 293మంది ప్రయాణికులు ఉన్నారు.