శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (18:24 IST)

సూప్ కుండల్లో హాంకాంగ్ మోడల్ కాళ్లు, తల, మాంసం

hongkong model
ఇటీవల హంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ (28) అత్యంత దారుణ హత్యకు గురయ్యారు. అయితే, ఆమె కాళ్లు ఫ్రిడ్జ్‌లో లభ్యమయ్యాయి. కనిపించని తల, చేతులు, మొండెం పోలీసులు గాలించారు. పోలీసులు ఎంత గాలించినా వాటి ఆచూకీని గుర్తించలేకపోయారు. దీంతో డాగ్ స్క్వాడ్‌, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మానవ అవశేషాలతో ఉన్న రెండు సూప్ కుండలను గుర్తించారు. వాటిలో ఒక కుండలో హత్యకు గురైన మోడల్ తలను హాంకాంగ్ పోలీసులు గుర్తించారు. దీనిపై ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సూపరింటెంటెండెంట్ అలాన్ చుంగ్ మాట్లాడుతూ, క్యారెట్, ముల్లింగితో తయారు చేసిన సూప్ కుండ నిండుగా చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 
 
సూప్ పాట్‌లోని ద్రవ్యంలో పైన తేలుతున్న తల కనిపించింది. తలపై చర్మంతో పాటు మాంసం పూర్తిగా తొలగించివుంది. పైకి చూసేందుకు అది పుర్రెలా కనిపించింది. ఆ సూప్‌లో ఇతర మాంసం ముక్కలు కూడా ఉన్నాయి. వాటిని మానవ అవశేషాలుగా గుర్తించారు. ఫోరెన్సిక్ రిపోర్టులో పుర్రె వెనుక భాగంలో రంధ్రం ఉన్నట్టు తెలిసింది. నిందితులు కారులో దాడికి పాల్పడి, స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత అత్యంత దారుణంగా హత్య చేసినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. 
 
కాగా, గత నెల 21వ తేదీన హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ మోడల్ అబ్బి చోయ్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో తై పో జిల్లాలోని ఓ ఇంట్లో ఫ్రిజ్‌లో ఆమె శరీర భాగాలను గుర్తించారు. ఇదే ఇంట్లో ఎలక్ట్రిక్ రంపం, మాంసం స్లైడర్, దుస్తులు, మోడల్ ఐడీ కార్డు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆమె మాజీ భర్త అలెక్స్ క్వాంగ్‌, అతని తండ్రి క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్‌లకు సంబంధం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరిని పోలీసులు అరెస్టు చేయగా, వీరికి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.