సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (16:43 IST)

తెగిపడిన తలలతో ఫుట్‌బాల్ ఆడిన ఖైదీలు... ఎక్కడ?

తెగిపడిన తలలతో ఖైదీలు ఫుట్‌బాల్ ఆడారు. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది. అల్టామిరా జైల్లో ఖైదీలు గ్రూపులుగా విడిపోయి ఘర్షణలకు దిగిన విషయం తెల్సిందే. ఈ ఘర్షణల్లో సుమారుగా 57 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అంతేనా, ఇరు గ్రూపులకు చెందిన ఖైదీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో 16 మంది ఖైదీల తలలు తెగిపడ్డాయి. ఈ తలలతో ఖైదీలు ఫుట్‌బాల్ ఆడారు. 
 
బ్రెజిల్‌లో అల్టామిరా అనే జైలులో కరుడుగట్టిన ఖైదీలు ఉన్నారు. ఈ జైల్లోని ఖైదులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడులో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కూడా ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఓ బ్యారక్‌లో ఉన్న ఖైదీలు మరో బ్యారక్‌లోకి చొరబడ్డారు. ఆ బ్యారక్‌కు నిప్పుపెట్టడమేకాకుండా, మారణాయులధాలతో దాడికి దిగారు. 
 
ఈ రెండు గ్యాంగులు భీకరపోరు సాగిస్తుండగా, మరికొంతమంది ఖైదీలు జైలు పైభాగంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక్కడ ఒళ్లు జలదరించే అంశం ఏమిటంటే మరణించినవారిలో 16 మంది తలలు మొండెం నుంచి వేరుచేసిన ఓ వర్గం ఖైదీలు, ఆ తలలతో ఫుట్‌బాల్ ఆడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి మీడియాలో ప్రసారమైంది.