1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (09:38 IST)

అమెరికాలో వ్యాక్సిన్ లేకపోతే ఉద్యోగం పోయినట్లే

అమెరికాలో డెల్టా వేరియంట్‌ కోవిడ్‌ కేసులు విస్తరిస్తోన్న వేళ... అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వెటరన్‌ అఫైర్స్‌ విభాగంలోని ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లందరూ రాబోయే రెండు నెలల్లోగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే వారిని ఉద్యోగాల్లో నుండి తొలగిస్తామని హెచ్చరించింది.

ఈ విషయాన్ని యుఎస్‌ అధ్యక్షుడు జోబైడెన్‌ ధ్రువీకరించారు. డాక్టర్లందరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని బైడెన్‌ స్పష్టంచేశారు. ఇప్పటికే డెల్టావేరియంట్‌ అమెరికాలో వ్యాపిస్తోంది.

కరోనా కేసులు 68 శాతానికి పెరిగాయి. ఈ నేపథ్యంలో వైద్యబఅందాలు, ఆరోగ్యశాఖ సిబ్బంది అందరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని పిలుపునిచ్చారు.