మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 24 జులై 2021 (14:07 IST)

25న విజయనగరం జిల్లాలో జాబ్‌మేళా

రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యో గులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా అధికారి పీబీ సాయిశ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 25న విజయనగరంలోని ఫోర్‌ ఎస్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూలకు  28 ఏళ్ల లోపు నిరుద్యోగులు హాజరు కావాలని తెలిపారు.

హెటిరో డ్రగ్స్‌ ఫార్మాసుటికల్‌ కంపెనీ  ప్రతినిధులు అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. ఐటీఐ ఫిట్టర్‌, డిప్లమో, మెకానికల్‌, ఏదైనా డిగ్రీ,  బీ ఫార్మసీ, ఎమ్‌ ఫార్మసీ చేసిన వారు హాజరు కావాలని సూచిం చారు.

ఇతర వివరాలకు 18004252422, 9182288475 నెంబర్లను సంప్రదించాలని కోరారు.