మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 24 జులై 2021 (14:01 IST)

నామినేటెడ్ పదవుల భర్తీలో మహిళలకు 50 శాతం: మంత్రి తానేటి వనిత

జగనన్న ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మహిళలకు 50 శాతం పైగా పదవులు మహిళాలకు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు, దివ్యంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.  
 
శనివారం  ఏలూరు జిల్లా సహకార బ్యాంక్ సొసైటీ సభ్యురాలుగా ఎంపికైన బండి లక్ష్మి నారాయణమ్మ తాడేపల్లిగూడెంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులును  మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత బండి లక్ష్మీ నారాయణమ్మను అభినందించారు.

బడుగు, బలహీన వర్గాలకు చేదోడుగా నిలిచి వారికి అండగా నిలిచి జగనన్న నమ్మకాన్ని నిలుపుకోవాలని సూచించారు.  మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు.  ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున మహిళలు పేరునే అమలు చెయ్యడం , ఇటీవల చేపట్టిన జగనన్న కాలనీలో మహిళల పేరునే పట్టాల పంపిణీ చేశామన్నారు.

ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. మంత్రి ని కలిసిన వారిలో బండి పట్టాభి రామారావు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.