గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (08:02 IST)

మళ్లీ ఇమ్రాన్‌ వాచాలత

కశ్మీర్‌ అంశం గురించి పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మళ్లీ తన వాచాలత చూపారు. భారత్‌ అంతర్గ వ్యవహారాలపై కూడా పరిధిమీరి మాట్లాడారు.

సోమవారం నాడాయన పాక్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కశ్మీర్‌లో జరుగుతున్న అంశాలపై  ఐక్యరాజ్యసమితిదే బాధ్యత అని, అక్కడ జరుగుతున్న మార్పుల గురించి ప్రపంచ దేశాలకు తాము తెలియజేయనున్నామని ఇమ్రాన్‌ అన్నారు.

కశ్మీర్‌ ప్రజల పట్ల తాము ఆందోళనగా ఉన్నామన్నారు. కశ్మీరీల కోసం యూఎన్‌ ముందుకు వస్తుందా లేదా వేచి చూడాలన్నారు. ట్రంప్‌, వెూదీ మధ్య పారిస్‌లో భేటీ జరిగిన తర్వాత ఇమ్రాన్‌ చేసిన ఈ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎఫ్‌ఏటీఎఫ్‌లో పాక్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వెనుక భారత్ కుట్ర ఉందని ఆరోపించారు. భారత దేశం కేవలం హిందువులకేనా అని ఇమ్రాన్‌ ప్రశ్నించారు.