బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 జులై 2017 (12:30 IST)

పైసా ఖర్చు లేకుండా.. 30 టన్నుల పుచ్చకాయలను తరలించారు ఎలాగో తెలుసా?

పైసా ఖర్చులేకుండానే 30 టన్నుల పుచ్చకాయలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించారు చైనా విద్యార్థులు. భారీ మొత్తంలో సరుకును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే సాధారణంగా పెద్ద ట్రక్కును విన

పైసా ఖర్చులేకుండానే 30 టన్నుల పుచ్చకాయలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించారు చైనా విద్యార్థులు. భారీ మొత్తంలో సరుకును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే సాధారణంగా పెద్ద ట్రక్కును వినియోగించాల్సి వస్తుంది. కానీ తాజాగా చైనాకు చెందిన ఓ యూనివర్శిటీ విద్యార్థులు అద్భుతం చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాలో గ్జింఝులో గ‌ల యూనివ‌ర్శిటీ‌లోని అధ్యాప‌కులు, విద్యార్థులు ఇటీవ‌లి కాలంలో ఎదురైన ఎండ‌ల‌కు ఇబ్బందులు ప‌డాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. దీంతో వీరంద‌రికీ ఉప‌శ‌మనం క‌లిగించేందుకు యూనివ‌ర్శిటీ యాజ‌మాన్యం భారీగా పుచ్చకాయ‌ల కొనుగోలుకు నిర్ణయించింది. ఇందుకోసం 30 టన్నుల పుచ్చకాయ‌ల‌కు ఆర్డర్ ఇచ్చింది.  
 
అయితే ఎటువంటి భారీ ర‌వాణా స‌దుపాయం లేకుండానే వీటిని త‌ర‌లించాల‌ని విద్యార్ధులు నిర్ణయించారు. దీంతో వారంతా భారీ మాన‌వ‌హారంగా త‌యారై, పుచ్చకాయ‌ల‌ను ఒక‌రి తర్వాత ఒకరు అందుకుంటూ 30 టన్నుల పుచ్చకాయలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చైనా విద్యార్థులను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.