గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (09:07 IST)

నేడు భారత్ - రష్యా శిఖరాగ్ర సదస్సు - హస్తినకు రానున్న పుతిన్

భారత్, రష్యా దేశాల మధ్య శిఖరాగ్ర సదస్సు సోమవారం జరుగనుంది. ఇందుకోసం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఇరు దేశాల మధ్య 21వ శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. 
 
ఇందుకోసం హస్తినకు చేరుకునే పుతిన్... సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. 
 
ముఖ్యంగా రక్షణ, వాణిజ్యం అంతరిక్షం, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో వివిధ రకాల ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అలాగే, 200 అత్యాధునిక హెలికాఫ్టర్ల తయారీపై కూడా రష్యాతో భారత్ ఓ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. 
 
ఈ శిఖరాగ్ర సదస్సు ముగిసిన తర్వాత పుతిన గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమం తర్వాత పుతిన్ రాత్రి 9.30 గంటలకి తిరిగి రష్యాకు వెళ్లిపోతారు.