1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 21 మే 2025 (14:03 IST)

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం

Erdogan
టర్కీ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆ దేశానికి కేవలం వెడ్డింగ్ టూరిజం ద్వారా భారతీయుల నుంచి ఏటా వచ్చే రూ. 11,000 కోట్లు రాకుండా పోయాయి. పాకిస్తాన్ దేశానికి బహిరంగ మద్దతు పలికిన టర్కీ అంటే ఇండియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాకిస్తాన్ దేశానికి ఏ ముఖం పెట్టుకుని మద్దతు ఇచ్చారు అంటూ నిలదీస్తున్నారు. తమ ఆగ్రహాన్ని టర్కీపై రకరకాల రూపంలో చూపిస్తున్నారు.
 
ఇప్పటికీ టర్కీ యాపిల్స్ దిగుమతి చేసుకోబోమని వ్యాపారులు తేల్చి చెప్పారు. దేశంలో అత్యధింగా టర్కీ నుంచి మార్బుల్స్ దిగుమతి అవుతుంటాయి. ఇకపై టర్కీ మార్బుల్స్ దిగుమతి చేయడం లేదంటూ మార్బుల్స్ వ్యాపారస్తులు వెల్లడించారు.
 
తాజాగా వీరి బాటలో వెడ్డింగ్ టూరిజం కూడా చేరిపోయింది. ప్రతి ఏటా భారతదేశం నుంచి హైప్రొఫైల్ ఇండియన్స్ తమ వెడ్డింగ్ డెస్టినేషన్ ను టర్కీగా ఎంచుకునేవారు. గత 2024లో 50కి పైగా ఇండియన్ కపుల్ పెళ్లిళ్లు ఇక్కడ జరిగాయి. ఒక్కో వివాహానికి కనీసం రూ. 60 కోట్లకు పైగా ఖర్చు పెడుతుంటారు.
 
ఐతే భారత్-పాక్ యుద్ధ సమయంలో టర్కీ బహిరంగంగా పాకిస్తాన్ దేశానికి మద్దతు ఇచ్చింది. ఆ దేశానికి డ్రోన్లను సరఫరా చేయడమే కాకుండా సైనికులను కూడా పంపినట్లు వార్తలు వచ్చాయి. టర్కీ భూకంపం సమయంలో భారతదేశం ఆ దేశానికి రూ. 6 లక్షల డాలర్ల సాయం అందించింది. దాన్ని కూడా పక్కకు తోసి టర్కీ ఇలా వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేందుకు యత్నించడంపై ఇండియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా టర్కీతో వున్న అన్ని వ్యాపార సంబంధాలను తెంచేసుకుంటున్నారు. దీనితో టర్కీకి వచ్చే ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ పరిణామంపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తలపట్టుకుని కూర్చున్నడు.