ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (14:56 IST)

యుద్ధానికి దిగేటంత సీన్ భారత్‌కు లేదు.. దిగితే పెను నష్టమే: పాక్ దౌత్యవేత్తలు

పాకిస్థాన్‌తో భారత్ ప్రత్యక్ష యుద్ధానికి దిగబోదని, ఒకవేళ దిగితే భారత్‌కే పెను నష్టం జరుగుతుందని పాకిస్థాన్ దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. యురీలోని భారత ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత ముష్కర మూకలు ద

పాకిస్థాన్‌తో భారత్ ప్రత్యక్ష యుద్ధానికి దిగబోదని, ఒకవేళ దిగితే భారత్‌కే పెను నష్టం జరుగుతుందని పాకిస్థాన్ దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. యురీలోని భారత ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత ముష్కర మూకలు దాడి చేసి 18 మంది జవాన్లను హతమార్చిన విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. 
 
భారత్ యుద్ధానికి దిగవచ్చని వార్తలు రావడంతో పాకిస్థాన్ కూడా అప్రమత్తమై రోడ్లపైకి ఫైటర్ జెట్లను తెచ్చిపెట్టింది. ఈ పరిణామాలపై దౌత్యవేత్తలు స్పందిస్తూ పాకిస్థాన్‌తో భారత్ యుద్ధానికి దిగేంత రిస్క్ చేయదన్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే, పాకిస్థాన్ కన్నా భారత్‌కే అధిక నష్టమని చెబుతున్నారు. 
 
ముఖ్యంగా భారత్ ఆర్థికంగా ఎంతో నష్టపోతుందని, ఆ నష్టం దశాబ్దాల పాటు పీడిస్తుందనే విషయం ఆ దేశ పాలకులకు బాగా తెలుసని వారు చెపుతున్నారు. ఇక పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలన్న భారత్ ఆలోచన తాత్కాలికంగా ఫలించినట్టు కనిపించినా, పాక్ ఏకాకి కాదని, తమకు ఎన్నో దేశాల మద్దతు ఉందని పాక్ పాలకులు చెప్పుకుంటున్నారు.