శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (09:02 IST)

ఇండోనేషియాలో మరో విమానం అదృశ్యం

ఏడాది తిరగక ముందే ఇండోనేసియాలో మరో విమానం గల్లంతైంది. 10 మందితో వెళ్తున్న విమానం జాడ కనిపించడం లేదు. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్లైన్కు చెందిన విమానం 10 మంది ప్రయాణీకులు, ముగ్గురు సిబ్బందితో కలసి దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని మసాంబ నుంచి మకస్సార్కు బయల్దేరింది.ఇందులో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. చాలా దూరు ప్రయాణించింది. 
 
మరో 30 నిమిషాల్లో విమానం మకస్సార్లో దిగాల్సి ఉంది. అయితే ఆ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. అది ఎక్కడకు వెళ్లిందనే అంశం ఇంకా తెలియడం లేదు. విమానం ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలను పంపారు.