అత్యాచారం సమయంలో బాధితురాలు వేసుకున్నది ఇలాంటి అండర్‌వేరే
ఐర్లాండ్‌లో ఇటీవల 17ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఈ కేసు విచారణలో భాగంగా కోర్టులో ఓ లాయర్ బాధితురాలిని కించపరిచేలా వాదించాడు. ఆ యువతి ఎలాంటి అండర్ వేర్ వేసుకుందో మీరు చూశారా అంటూ లాయర్ సాక్షులను అడ్డమైన ప్రశ్నలు వేశాడు.
అంతేకాదు.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో ఐర్లాండ్ న్యాయ వ్యవస్థపై ప్రజలు తీవ్ర నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో మహిళా ఎంపీ రూత్ తమ దేశ న్యాయవ్యవస్థపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మహిళలు ధరించే అండర్‌వేర్‌ను మిగతా ఎంపీలకు చూపిస్తూ ఫైర్ అయ్యారు.
అత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలు వేసుకున్నది.. ఇలాంటి అండర్‌వేరే అంటూ నిరసన వ్యక్తం చేస్తూ.. పార్లమెంట్‌లో ఆ అండర్‌వేర్‌ను ప్రదర్శించారు. మహిళల దుస్థితిని వివరించడానికే మహిళలు ఉపయోగించే లో దుస్తులను తీసుకుని పార్లమెంట్‌కు వెళ్లాల్సి వచ్చిందన్నారు. తద్వారా దేశ అత్యున్నత సభ ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లగలిగానని వాపోయారు.