శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 30 మార్చి 2018 (22:46 IST)

టీనేజ్ అమ్మాయిలకు కావలసింది....

మన శరీరానికి అవసరమైన అత్యవసర మూలకాలలో ఒకటి మెగ్నీషియం. ముఖ్యంగా స్త్రీలలో ఈ ఖనిజం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మెగ్నీషియం పుష్కలంగా వుండే ఆహార పదార్థాలేంటో ఒకసారి తెలుసుకుందాం. 1. టీనేజి అమ్మాయిలకు రోజుకు 360 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది

మన శరీరానికి అవసరమైన అత్యవసర మూలకాలలో ఒకటి మెగ్నీషియం. ముఖ్యంగా స్త్రీలలో ఈ ఖనిజం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే  మెగ్నీషియం పుష్కలంగా వుండే ఆహార పదార్థాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
 
1. టీనేజి అమ్మాయిలకు రోజుకు 360 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది. ఆ తరువాత ముప్పై ఏళ్ల లోపు వారికి 310 మి.గ్రా, ఆపైన 320 మి.గ్రా కావాలి.
 
2. మనం ఇష్టంగా తినే డార్క్ చాక్లెట్‌లో ఇది పుష్కల్లంగా దొరుకుతుంది. రోజు మనం తీసుకోవల్సిన మెగ్నీషియం శాతంలో ఇరవై శాతం ఇది తింటే పొందొచ్చు. అలాగే దీంట్లో మాంగనీసు, రాగి, ఇనుము వంటివి కూడా ఎక్కువ శాతంలోనే ఉంటాయి.
 
3. మాంసకృత్తులు మెండుగా వుండే బీన్స్ తృణధాన్యాలను ఎక్కువుగా తీసుకోవడానికి  ప్రయత్నించాలి. ముఖ్యంగా ఒక కప్పు సోయాతోనే 85 గ్రాముల మెగ్నీషియం ఉంటుంది.
 
4. 28 గ్రాముల జీడిపప్పు తింటే ఒక రోజుకు అవసరమయ్యే మెగ్నీషియంలో 20 శాతం తీసుకున్నట్లే. అలాగే అరటి పండులో రోజుకు మన శరీరానికి  కావల్సిన మెగ్నీషియంలో 10శాతం దొరుకుతుంది. దాంతోపాటే వీటిలో విటమిన్ సి, పీచు, యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి.