శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (13:36 IST)

ఆ వీడియోలు చూడాలని ఐసిస్ ఉగ్రవాదులు ఒత్తిడి చేశారు : ఆంధ్రా వైద్యుడు

డాక్టర్ రామమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు. ఇటీవలే లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈయన ఆ ఉగ్ర సంస్థ గురించి అనేక విషయాలను వెల్లడించారు.

డాక్టర్ రామమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు. ఇటీవలే లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈయన ఆ ఉగ్ర సంస్థ గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఇరాక్, సిరియా, నైజీరియా సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఐసిస్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి సంబంధించిన వీడియాలను చూడాలని తమను బలవంతం చేసేవారని చెప్పారు.
 
అయితే వారు తమపై ఎప్పుడూ భౌతిక దాడులకు దిగలేదని, మాటలతో మాత్రం హింసించేవారని పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో చాలామంది యువకులు బాగా చదువుకున్నవారేనని రామమూర్తి తెలిపారు. ముఖ్యంగా వారికి భారతదేశం గురించి చాలా విషయాలు తెలుసన్నారు. వీరంతా కలిసి భారత్‌ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
 
అదేసమయంలో తాను డాక్టర్‌ను కావడంతో ఆపరేషన్లను చేయాలని తనను బలవంతం చేసేవారని ఆయన పేర్కొన్నారు. తనను ఆపరేషన్ థియేటర్లోకి బలవంతంగా పంపించేవారని, అయితే తానెప్పుడూ ఆపరేషన్ కానీ, చిరికి కుట్లు కూడా వేయలేదన్నారు. తాను షిర్టేలో వర్కింగ్ క్యాంపులో ఉన్నప్పుడు ఉగ్రవాదులు మూడుసార్లు తనపై కాల్పులు జరిపారని, అదృష్టవశాత్తు తాను ప్రాణాలతో బయటపడినట్టు చెప్పారు.