శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 15 మే 2017 (10:42 IST)

ఫేస్‌బుక్‌లో లైక్ కొడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త...

ఫేస్‌బుక్ యూజర్లు తమకు నచ్చిన ఫోటలోకు లైక్ కొడుతుంటారు. మరికొందరు కామెంట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటివారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల వలలో పడే అవకాశ

ఫేస్‌బుక్ యూజర్లు తమకు నచ్చిన ఫోటలోకు లైక్ కొడుతుంటారు. మరికొందరు కామెంట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటివారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల వలలో పడే అవకాశం ఉంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సైబర్ వింగ్ ఎక్కువగా ఫేస్ బుక్ యూజర్లు లైక్స్ లేదా షేర్ కొట్టే పోస్టింగ్స్, వీడియోలపైనే ఫోకస్ చేసినట్టు పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ఆధారితంగా యువకులను ఐఎస్ షార్ట్ లిస్టు చేస్తుందని పోలీసు శాఖ పేర్కొంది. దీని ద్వారా వారి కార్యకలాపాలకు యువకులను రిక్రూట్ చేసుకుంటుందట. ఇప్పటికే ఈ విధంగా చాలా ఘటనలు జరిగాయని, కేరళలో 21 మంది యువకులు మిస్ అయ్యారని, వారు ఇస్లామిక్ స్టేట్స్‌లో ఉన్నట్టు గుర్తించినట్టు అక్కడి పోలీసు అధికారులు చెప్పారు. 
 
ఐఎస్ సైబర్ వింగ్ ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌పైన ఉన్న యువతనే టార్గెట్ చేస్తుందని తెలిపారు. ఈ సైబర్ వింగ్, ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లతో రన్ అవుతూ వీడియోలను, ఆర్టికల్స్‌ను పోస్టు చేస్తుందని, వీటి ద్వారా యువతను షార్ట్ లిస్ట్ చేస్తుందని తిరువనంతపురం రుంజ్ ఐజీ మనోజ్ అబ్రహ్మం చెప్పారు. వారి పోస్టులను షేర్ చేసినా.. లైక్ చేసినా ఐఎస్ వారితో కాంటాక్ట్ అవుతారని చెప్పారు. ఫేక్ ఐడీలతో ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు జరుపుతున్న వారిని కేరళ పోలీసు సైబర్ వింగ్ గుర్తిస్తుందని తెలిపారు. కేరళలో మిస్ అయిన 21 మంది యువకులు సిరియాకు వెళ్లి,  ఐఎస్ గ్రూప్ లో చేరినట్టు అబ్దులా రషీద్ వెల్లడించారు.