టోక్యోలో కత్తితో బీభత్సం సృష్టించిన యువకుడు.. కేర్ హోమ్‌పై అటాక్.. 19 మంది మృతి!
26 ఏళ్ల యువకుడు జపాన్ రాజధాని టోక్యోలో బీభత్సం సృష్టించాడు. ఓ కేర్ హోమ్‌ను టార్గెట్ చేసుకున్న ఆ యువకుడు మానసిక వికలాంగులపై విచక్షణారహితంగా కాల్చి చంపాడు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా మరో 25 మంది తీవ్రం
26 ఏళ్ల యువకుడు జపాన్ రాజధాని టోక్యోలో బీభత్సం సృష్టించాడు. ఓ కేర్ హోమ్‌ను టార్గెట్ చేసుకున్న ఆ యువకుడు మానసిక వికలాంగులపై విచక్షణారహితంగా కాల్చి చంపాడు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. కేర్‌హోమ్‌పై నల్ల బట్టలు ధరించిన ఓ దుండగుడు సాగమిహర వికలాంగుల ఆశ్రమంలోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దుండగుడిని సతోషి యెమత్సుగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేయగా.. అతడి సంచిలో నుంచి రక్తంతో తడిసిన పలు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
కేర్ హోమ్‌పై అతడు దాడికి ఎందుకు పాల్పడాల్సి వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. మరణించిన వారిలో 9 మంది మహిళలు పది మంది పురుషులు ఉన్నారని 18-70ఏళ్ల లోపు గల వారిపై ఆ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు చెప్తున్నారు.