బుధవారం, 29 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (11:11 IST)

125 సంవత్సరాల రికార్డ్ బ్రేక్.. జపాన్‌లో హాటెస్ట్ సెప్టెంబరు

summer
125 సంవత్సరాల క్రితం రికార్డులు ప్రారంభమైనప్పటి నుండి జపాన్ తన హాటెస్ట్ సెప్టెంబరును చూసింది. మానవ చరిత్రలో ఒక సంవత్సరంలో ఇదే అత్యంత వేడిగా గడిచిన సమ్మర్ అని వాతావరణ సంస్థ తెలిపింది.

సెప్టెంబరు సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.66 డిగ్రీల సెల్సియస్ (36.78 డిగ్రీల ఫారెన్‌హీట్) ఎక్కువగా ఉందని జపాన్ వాతావరణ సంస్థ సోమవారం తెలిపింది.
 
"1898లో గణాంకాలు ప్రారంభమైనప్పటి నుండి ఇది అత్యధిక సంఖ్య" అని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, స్విట్జర్లాండ్‌తో సహా దేశాలు ఈ ఏడాది అత్యధిక వేడిని ఎదుర్కొన్నాయి.