కెనడా ప్రధాని ట్రూడో బహిరంగ క్షమాపణలు
కెనడా ప్రధాని ట్రూడో దారికొచ్చారు. భారత్‌పై చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఎలా వుంటుందో ఆయనకు అర్థమైందో ఏమోకానీ.. ట్రూడో బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. నాజీల తరఫున పోరాడిన వ్యక్తిని.. దేశ పార్లమెంటులో హీరోగా అభివర్ణించినందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో క్షమాపణలు చెప్పారు. ఆ వ్యక్తిని గుర్తించడంలో.. ఘోర తప్పిదం జరిగిందని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల కెనడాలో పర్యటించారు.
గత శుక్రవారం కెనడా పార్లమెంట్‌కు వెళ్లారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ఆంటోనీ రోటా.. ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యూరో స్లోవ్ హంకాను ఆహ్వానించారు.
అయితే ఈ వ్యక్తిని ట్రూడో పెద్దగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 98 ఏళ్ల యూరోస్లోవ్ హంకాను ఆహ్వానించారు. పార్లమెంట్‌లో జెలెన్‌స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్ రోటా స్వయంగా యారోస్లోవ్ హంకాను పరిచయం చేస్తూ రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి.. పోరాడిన యోధుడిగా కీర్తించారు. వెంటనే ప్రధాన జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా అందరూ చప్పట్లు కొట్టారు.
అయితే కెనడా పార్లమెంట్ గౌరవించిన హంకా రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పక్షాన పోరాడిన.. 14వ వాఫన్ గ్రనేడియర్ డివిజన్‌కు చెందిన వ్యక్తి అని తర్వాత తెలిసింది.