1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (20:01 IST)

స్విట్జర్లాండ్ పార్లమెంట్ కీలక నిర్ణయం- బుర్ఖా వేస్తే ఫైన్

burqa
స్విట్జర్లాండ్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ బుర్ఖాలను నిషేధించే బిల్లుకు ఆమోదం తెలిపింది.

బుర్ఖా ధారణకు వ్యతిరేకంగా మెజారిటీ ప్రజలు ఓటు వేశారు. 151-29 ఓట్ల తేడాతో నేషనల్ కౌన్సిల్ ఈ బిల్లుకు తుది ఆమోదం చెపింది. 
 
ఇప్పటికే ఈ బిల్లుకు ఎగువ సభ కూడా ఆమోదం చెప్పినందున ఇక చట్టరూపం దాల్చినట్టుగానే భావించొచ్చు. ఇక ఇది చట్ట రూపం దాల్చినందున దీన్ని ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించనున్నారు