సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (09:43 IST)

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం.. ఆహారంలో మానవ చేతిగోళ్లు..!

ముంబై-గోవా సీఎస్ఎంటీ- మడగావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణీకుడికి అందించిన ఆహారంలో నాణ్యత కొరవడింది. ఆ ఆహారంలో మానవ వేలుగోళ్లు కనిపించాయి. 
 
దీన్ని వీడియో తీసిన ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, చాలా మంది ప్రజలు రైల్వే అందించే ఆహార నాణ్యతతో తమ చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
 
ఈ విషయం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ దృష్టికి వెళ్లడంతో సంబంధిత క్యాటరింగ్ కాంట్రాక్టర్‌పై రూ.25 వేలు జరిమానా విధిస్తూ చర్యలు చేపట్టింది. 
 
ఈ విషయంపై IRCTC అధికారి ఒకరు మాట్లాడుతూ, "రైల్వేలో ప్రయాణికులకు మంచి ఆహారం అందుతుందో లేదో తెలుసుకోవడానికి ఒక బృందాన్ని నియమించారు. కొన్ని ప్రోటోకాల్‌లు అభివృద్ధి చేయబడ్డాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక అధికారి మానిటరింగ్ డ్యూటీలో ఉన్నారు. 
 
ఈసారి IRCTC రత్నగిరిలోని వంటశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. IRCTC తీసుకున్న ఈ చర్య భవిష్యత్తులో ప్రయాణీకులకు మంచి ఆహారం అందేలా చేస్తుంది" అని ఆయన అన్నారు.