మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (22:01 IST)

పట్టాలెక్కనున్న మరో ఐదు #VandeBharatExpress రైళ్లు

vande bharat express
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన సెమీ స్పీడ్ రైళ్ల అయిన వందే భారత్ రైళ్లు మరో ఐదు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తాజాగా మరో ఐదు రైళ్లను నడపాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ఐదు రైళ్లతో కలిసి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరిగే వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరనుంది.
 
ఈ నెల 27వ తేదీన మరో ఐదు వందే భారత్ రైళ్లకు ప్రధాని మోడీ పచ్చజెండా ఊపనున్నారు. ఈ ఐదు రైళ్లు వివిధ మార్గాల్లో నడుపనున్నారు. ముంబై - గోవా, ఇండోర్ - భోపాల్, పాట్నా - రాంచీ, జబల్పూర్ -రాణి కమ్లాపాటి, బెంగుళూరు - హుబ్లీ - ధార్వాడ్ మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీయనున్నాయి. దేశ వ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగా, కేంద్రం ఈ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టింది.