ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (22:58 IST)

లొకేషన్ హిస్టరీ సెట్టింగ్‌ ఆఫ్ చేసినా గూగుల్ ఆ పని చేసింది..

google map
గూగుల్ యూజర్ల లొకేషన్ హిస్టరీ సెట్టింగ్‌ను ఆఫ్ చేసిన తర్వాత కూడా గూగుల్ వారి లొకేషన్ ట్రాక్ చేస్తుందని తేలడంతో సదరు సంస్థ వేల కోట్ల జరిమానా చెల్లించనుంది. ప్రధానంగా గూగుల్ మ్యాప్‌లు, లోకేషన్-ఆధారిత సర్వీసుల్లో బెస్ట్. ఇంటర్నెట్ అంతటా వివిధ కారణాల వల్ల గూగుల్ తన యూజర్లను ట్రాక్ చేస్తుంది. 
 
అయితే, యూజర్లు ట్రాకింగ్‌ను నిలిపివేస్తే లొకేషన్‌ను ట్రాక్ చేయదని గూగుల్ ఎల్లప్పుడూ స్పష్టం చేసింది. కానీ యూజర్ల లొకేషన్‌ను సీక్రెట్‌గా గూగుల్ ట్రాక్ చేయడంతో రూ.7వేల కోట్ల జరిమానా చెల్లించనుంది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా దాఖలు చేసిన దావా ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
గూగుల్ యూజర్ల ‘లొకేషన్ హిస్టరీ’ని నిలిపివేయడానికి యూజర్లను అనుమతించిందని, వారు అలా చేస్తే కంపెనీ వారి ఆచూకీని ట్రాక్ చేయదని హామీ ఇచ్చింది. కానీ యూజర్ల ట్రాకింగ్‌ను గూగుల్ రహస్యంగా గమనించింది.