పాకిస్థాన్‌లో అంతర్భాగమే కాశ్మీర్.. ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం : షరీఫ్
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంటే పాకిస్థాన్‌లో అంతర్భాగమేననీ, స్వీయ నిర్ణయాధికారానికి అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటం గొప్పదనీ ఆయన అన్నారు.
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంటే పాకిస్థాన్‌లో అంతర్భాగమేననీ, స్వీయ నిర్ణయాధికారానికి అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటం గొప్పదనీ ఆయన అన్నారు.
కాశ్మీర్ అంశంపై ఇస్లామాబాద్‌లో రెండ్రోజులు జరిగే అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సునుద్దేశించి ఆయన గురువారం కీలక ప్రసంగం చేశారు. ఇందులోనే పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. భారత బలగాల కాల్పుల్లో హతుడైన హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్‌వానీ 'ఉత్తేజ భరితమైన, ప్రజాకర్షణ ఉన్ననేత'అని అభివర్ణించారు.
బుర్హాన్ వానీ ప్రాణత్యాగంతో కాశ్మీర్ ఉద్యమం కొత్త మలుపు తిరిగిందన్నారు. అందువల్ల ఖచ్చితంగా కాశ్మీర్‌ను ఎప్పటికైనా తమ భూభాగంలో కలిపేసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. ప్రగల్భాలు పలకడంమాని.. ఇరు దేశాల మధ్య శాంతికోసం ప్రయత్నించాలని భారత్ నేతలు సూచించారు.