ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 జనవరి 2017 (17:57 IST)

క్షిపణుల రూపకల్పనలో వెనక్కి తగ్గేది లేదు.. ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే: కిమ్ జోంగ్

అణు ఆయుధాల అభివృద్ధిలో ఉత్తర కొరియా మరో అడుగు ముందుకేసింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధిలో భాగంగా ఈ క్షిపణుల రూపకల్పనలో చివరి దశలో ఉన్నామని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. అణు, క

అణు ఆయుధాల అభివృద్ధిలో ఉత్తర కొరియా మరో అడుగు ముందుకేసింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధిలో భాగంగా ఈ క్షిపణుల రూపకల్పనలో చివరి దశలో ఉన్నామని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. అణు, క్షిపణి కార్యక్రమాలను మూసివేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. తమ శక్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు మరిన్ని ఆయుధాలను సిద్ధం చేసుకుంటామని జోంగ్ స్పష్టం చేశారు. ఆయుధాల తయారీని వేగవంతం చేశామన్నారు. దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధిలో చివరి దశకు చేరుకున్నామని కిమ్ జోంగ్ ప్రసంగంలో పేర్కొన్నారు.
 
గతేడాది నిర్వహించిన రెండు అణుపరీక్షలు విజయవంతం అవడంతో మిలటరీ మరింత శక్తిమంతమైందని పేర్కొన్నారు. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించుకోవడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు అణ్వాయుధాలతో సిద్ధంగా ఉన్నామన్నారు. తమను చూస్తే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందేనని అన్నారు.