గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (15:05 IST)

రిప్డ్‌ జీన్స్‌ వేసుకునే యువతులపై రేప్ చేయడం జాతీయ బాధ్యత.. ఎవరు?

మహిళలపై వేధింపులు, అత్యాచారాలు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఎక్కువైపోతున్నాయి. మహిళలను వేధింపులకు గురిచేసే ప్రబుద్ధులు పెచ్చరిల్లిపోతున్నారు. అయితే ఇలా మహిళలపై అకృత్యాలు పెరిగిపోయేందుకు కారణం డ్రెస్

మహిళలపై వేధింపులు, అత్యాచారాలు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఎక్కువైపోతున్నాయి. మహిళలను వేధింపులకు గురిచేసే ప్రబుద్ధులు పెచ్చరిల్లిపోతున్నారు. అయితే ఇలా మహిళలపై అకృత్యాలు పెరిగిపోయేందుకు కారణం డ్రెస్ కోడ్‌నేని కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాఖలాలున్నాయి. తాజాగా ఇదే కోవలో చేరిపోయారు.. ఈజిప్టు చెందిన న్యాయవాది నబీ అల్ వాల్ష్.
 
ఈజిప్టుకు చెందిన ఓ జాతీయ ఛానల్ వ్యభిచారాన్ని చట్టంగా చేయాలనే దానిపై చర్చ నిర్వహించింది. ఈ చర్చలు న్యాయ నిపుణులు పాల్గొన్నారు. ఈ చర్చలో పాల్గొనేందుకు వచ్చిన వారిలో నబీ అల్‌ వాల్ష్‌ అనే న్యాయవాది, ఒక మహిళా ఉన్నారు.
 
ఇక చర్చ జరుగుతున్న వేళ నబీ అల్‌ వాల్ష్‌‌కు అదే కార్యక్రమంలో పాల్గొన్న మహిళకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ మహిళను ఉద్దేశించి నబీ అల్ వాల్ష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రిప్డ్‌ జీన్స్‌ వేసుకునే ప్రతి అమ్మాయిని లైంగికంగా వేధించవచ్చునని.. అలాంటి యువతులపై రేప్ చేయడాన్ని జాతీయ బాధ్యతగా అభివర్ణించారు. నబీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమైనాయి. మహిళలపై దారుణంగా కామెంట్స్ చేసిన న్యాయవాది అల్ వాల్ష్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.