బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (12:56 IST)

బొమ్మలను పక్కనబెట్టండి.. ఈ రోజుకు మీ ఇద్దరికీ పెళ్లి..?

రుమేనియాలో పదేళ్ల బాలుడికి ఎనిమిదేళ్ల చిన్నారికి వివాహం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాలపై నిషేధం వున్న సంగతి తెలిసిందే. అయితే రుమేనియాలో చిన్నారులకు వివాహాన్ని చేసిపెట్టారు.. పెద్దలు. ఈ క్రమంలో రుమేనియాలోని క్రియోవాకు చెందిన ఓ వలస కుటుంబానికి చెందిన పదేళ్ల చిన్నారికి ఎనిమిదేళ్ల బాలికకు వివాహం జరిపారు. 
 
అయితే తమకు ఏం జరుగుతుందని తెలియని వయస్సులో ఆ చిన్నారులు విస్తుపోయారు. బొమ్మలను పక్కనబెట్టండి.. ఈ రోజుకు మీకు పెళ్లి అంటూ పెద్దలు చెప్తుంటే ఆ చిన్నారులు పేలగా చూశారు. రొమానియాలో బాల్య వివాహాలపై పూర్తి నిషేధం వుంది. క్రిస్టియన్ సంప్రదాయబద్ధంగా అట్టహాసంగా ఈ బాల్య వివాహం బాలుర సమ్మతంతో జరిగింది. ఈ బాల్య వివాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.