సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (11:28 IST)

మంచి మొగుడ్ని చూసిపెట్టమని ఫ్రెండ్స్‌కు చెప్పా... రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్‌లోని కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. అటు తెలుగు చిత్ర పరిశ్రమలోనేకాకుండా, కోలీవుడ్, బాలీవుడ్‌లలో నటిస్తూ ముందుకుసాగిపోతోంది. ఈమెకు పెళ్లి చేయాలని రకుల్ ప్రీత్ సింగ్ తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని రకుల్ వద్ద వారు ప్రస్తావించారు కూడా. దీనికి ఈ అమ్మడు ఎలాంటి సమాధానం చెప్పకుండా మిన్నకుండి పోయింది. 
 
కానీ, తన స్నేహితుల వద్ద మాత్రం మంచి మొగుడ్ని చూసిపెట్టాలని చెబుతోందట. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ, 'ఎపుడూ నటన, కెరీర్ అంటూ వృత్తిపరంగా బిజీగా ఉంటున్నావు. నీ గురించి నీవు ఎపుడూ ఆలోచిస్తావు? నీకంటూ ఓ క్షణం కేటాయించుకోవా? అంటూ ఈ మధ్యనే అమ్మ నన్ను నిలదీసింది. ఇదంతా నా పెళ్లి కోసమే అని అర్థమైంది. అందుకే కాసేపు సైలెంట్‌గా ఉండిపోయాను' అని చెప్పింది. 
 
కానీ, 'ప్రతి రోజూ సాయంత్రంకాగానే నా స్నేహితుల్ని మీరు ఎందుకూ పనికిరారు అని తిడుతుంటా. ఎందుకంటే నాకొక మంచి పార్ట్‌నర్‌ని చూడమని ఎపుడూ వాళ్లకి చెబుతుంటా. కానీ వాళ్లు మాత్రం ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అమ్మ ఏమో.. పెళ్లి వయసు దాటిపోతుంది.. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి అంటోంది. ప్రేమ, పెళ్లి అంటే నాకిష్టమే. అందుకే హైదరాబాద్, ముంబైలలో ఉన్న నా స్నేహితులకు మంచి అబ్బాయిని చూడమని చెప్పా' అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.