శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (13:06 IST)

అందరూ చూస్తుండగా సమంత, చైతూ అలా చేశారు..

టాలీవుడ్ లవ్ బర్డ్స్ సమంత, నాగచైతన్య త్వరలో తెరపై కూడా భార్యాభర్తలుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లికి తర్వాత తొలిసారిగా ఈ జంట కలిసి నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు మజిలీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సింహాచలం రైల్వే స్టేషన్‌లో జరిగింది. 
 
సమంతను బైకుపై ఎక్కించుకుని రైల్వే స్టేషన్లోకి చైతూ వేగంగా తీసుకెళ్తున్నాడు. బైక్ దిగగానే టికెట్ కౌంటర్ వైపు సమంత హడావుడిగా పరిగెడుతుంది. రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులు అంతా ఉండగానే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇంకా సమంత-చైతూలను చూసేందుకు భారీ సంఖ్య ఫ్యాన్స్ అక్కడికి తరలివచ్చారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను సింహాచలంలో చిత్రీకరించనున్నట్లు సినీ యూనిట్ వెల్లడించింది.