శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (13:25 IST)

వైజాగ్‌కు చేరిన చైతూ - సామ్ దంపతుల "మజిలి"

నిజ జీవితంలో భార్యాభర్తలుగా ఉన్న అక్కినేని నాగ చైతన్య, సమంతలు కలిసి ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి 'మజిలి' అని పేరు పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ వైజాగ్‌లో జరుపుకోనుంది. 
 
వీరిద్దరూ దంపతులుగా ఒక్కటికాకముందు ఏ మాయ చేశావే, "ఆటో నగర్ సూర్య, మనం" వంటి చిత్రాలు చేశారు. వీటిలో 'ఆటో నగర్' సూర్య మాత్రం నిరాశపరచగా, మిగిలిన రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఇపుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'మజలి'. హరీష్ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్ర పోషిస్తోంది. గోపిసుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో చైతూ, సమంతలతో పాటు రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రవి ప్రకాష్, కరణ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తిస్థాయిలో కుటుంబ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో తొలి షెడ్యూల్ పూర్తి చేస్తున్న 'మజలి'.. ఇపుడు వచ్చే 19వ తేదీ నుంచి వైజాగ్‌లో తదుపరి షెడ్యూల్‌ను జరుపుకోనుంది. కాగా, నాగ చైతన్య నటించిన "శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి" చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచిన విషయం తెల్సిందే.