సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (16:36 IST)

మెర్సల్ హీరో సరసన నయనతార.. సమంత.. కాంబినేషన్ అదిరిపోతుందా?

మెర్సల్, సర్కార్ హీరో విజయ్ సరసన డబుల్ హీరోయిన్స్ నటించడం కొత్తేమీ కాదు. అదీ బాగా క్రేజున్న హీరోయిన్స్.. విజయ్ సరసన నటిస్తే ఆ సినిమా బంపర్ హిట్టేనని కోలీవుడ్‌లో టాక్. తాజాగా అలాంటి కాంబినేషనే ఒకటి కానుంది. 
 
గతంలో అసిన్, నయనతార ఒకే సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని పేరుంది. అలా హిట్ కొట్టిన సినిమాల్లో గజినీ ఒకటి. ప్రస్తుతం విజయ్ 63వ సినిమాలో సమంత, నయనతార కాంబో తెరకెక్కనుంది. సపరేటుగానూ విజయ్‌తో నటించిన వీరిద్దరూ.. అతనితో కలిసి నటించనున్నారు. 
 
ఇప్పటికే విజయ్ సర్కార్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. వివాదాలు వెంటాడినా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న విజయ్, తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. ఇక తాజాగా విజయ్ 63వ సినిమాకు అట్లీ కుమార్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. 
 
గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన తెరి, మెర్సల్ సూపర్ డూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. దాంతో ఈ కాంబినేషన్లో మూడవ చిత్రం పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాలో కథానాయికలుగా నయనతార .. సమంత కనిపించనున్నారని టాక్ వస్తోంది.