మంగళవారం, 11 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2016 (16:36 IST)

ఈ రెస్టారెంట్ కొంచెం హాట్ గురూ.. నగ్న రెస్టారెంట్‌ 11న ప్రారంభం.. 60 వేల మంది అడ్వాన్స్ బుకింగ్!

మనం ఇప్పటి వరకూ ఎన్నో రకాల రెస్టారెంట్లకు వెళ్లుంటాం. కొన్ని రెస్టారెంట్లు సముద్రం మధ్యలో దర్శనమిస్తుంటాయి. మరికొన్ని కొండలపై భాగంలో రూపొందించి ఉంటారు.

మనం ఇప్పటి వరకూ ఎన్నో రకాల రెస్టారెంట్లకు వెళ్లుంటాం. కొన్ని రెస్టారెంట్లు సముద్రం మధ్యలో దర్శనమిస్తుంటాయి. మరికొన్ని కొండలపై భాగంలో రూపొందించి ఉంటారు. గార్డెన్ మధ్యలో, ఎయిర్ రెస్టారెంట్స్, నీటిలో విహరిస్తున్న రకాలైన రెస్టారెంట్లను గురించి వినుంటాం. కానీ తాజాగా లండన్‌లో ప్రారంభంకానున్న రెస్టారెంట్ మాత్రం వీటన్నింటికీ పూర్తిభిన్నంగా ఉంటుంది. సాధారణంగా రెస్టారెంట్‌కు వెళ్ళేటప్పుడు బాగా ముస్తాబై రంగు రంగుల దుస్తులు వేసుకుని వెళుతుంటాం. కాని ఇకమీదట వాటికి పనుండదు. 
 
ఎందుకో తెలుసా..? లండన్‌లోని బున్యదిస్‌లో ఓపెన్ చేయబోయే ఈ రెస్టారెంటుకి వెళితే దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా కూర్చుని భోజనం చేయాలి. ''ది బునియాది''గా పిలిచే ఈ రెస్టారెంట్‌లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండోయ్. శాకాహార, మాంసాహార వంటలను మట్టికుండల్లో, చెంచాలతో వడ్డిస్తారు. ఈ చెంచాలను ఆహారపదార్థాలతో తయారుచేస్తారట.
 
రసాయనాలులేని వంటలు ఈ రెస్టారెంట్ మరో ప్రత్యేకత. ఈ నియమం నచ్చి ఇప్పటికే దాదాపు 60,000 మంది కస్టమర్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఒకేసారి 42 మంది ఇక్కడ నగ్నంగా కూర్చుని భోజనం చేయవచ్చు. విద్యుత్, ఫోన్, దుస్తులు ఇలా ఎలాంటివి లేని ప్రపంచాన్ని పరిచయం చేయడం కోసం ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పినట్లు రెస్టారెంట్ మాతృ సంస్థ అయిన ''లాలీపాప్'' వ్యవస్థాపకుడు సెబ్ లేయాల్ ప్రకటించారు. జూన్ 11న ప్రారంభం కాబోయే ఈ రెస్టారెంట్ కేవలం మూడు నెలలు మాత్రమే ఓపెన్ చేయబడి ఉంటుందట. ఈ రెస్టారెంట్ కొంచెం హాట్ గురూ...!