శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Modified: గురువారం, 4 జులై 2019 (14:30 IST)

తేలు కనిపిస్తే కరకరమంటూ నమిలేస్తాడు... ఆ తర్వాత?

సాధారణంగా తేలు కనిపిస్తే మనం దాదాపుగా పరుగుపెడతాం. మనకు అందుబాటులో ఉన్న కర్రతోనో లేదా రాయితోనో కొట్టి చంపేస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం చాలా ఢిఫెరెంట్. అతను తేళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటిని తినేస్తాడు. ఇప్పటికే వందలాది తేళ్లను తిన్నాడు. అయితే దాని వల్ల అతడికి ఏమీ కాలేదు. 
 
ఇది తెలిసిన వారు ఆశ్యర్యపోతున్నారు. ఆయన పేరు మాకప్ప. ఆయన కనిపించిన తేళ్లను ఎందుకు తింటున్నాడో అని ఆరా తీయగా.. మాకప్ప ఇరవై సంవత్సరాల క్రితం గుడిసె కప్పుతుండగా ఆయనకు తేలు కుట్టింది. అప్పుడు వైద్యం చేయించుకున్నాడు. అయితే కొద్దిరోజుల తర్వాత మళ్లీ మరో తేలు కుట్టింది. 
 
ఈసారి మాకప్పకు కోపం వచ్చి ఆ తేలును కాస్త నోటిలో వేసుకుని కొరికి నమిలేసాడు. ఈ విధంగా ఓ వంద తేళ్ల వరకు తినేసాడు. ఆ తర్వాత తేళ్లను తినడం అలవాటు చేసుకున్నాడు. ఊళ్లో ఎక్కడ తేలు కనబడినా గ్రామస్థులు వెంటనే ఆయనకు సమాచారం ఇస్తారు. ఇప్పటివరకు ఇలా చేయడం వల్ల తనకు ఇబ్బంది కలగలేదని, అలాగే తన సోదరికి కూడా ఓ సారి రక్తం అవసరమైనప్పుడు రక్తదానం చేసానని మాకప్ప చెబుతున్నాడు. అయితే దీనిని ఎవరూ ప్రయత్నించవద్దని సలహా ఇస్తున్నాడు.